2020 క్రేజీ కాంబో : సుకుమార్ – విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

2020 క్రేజీ కాంబో : సుకుమార్ - విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
2020 క్రేజీ కాంబో : సుకుమార్ – విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

2020 క్రేజీ కాంబో సెట్ట‌యింది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ .. సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌ల‌యిక‌లో  ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని సోమవారం ప్ర‌క‌టించారు. ఫాల్క‌న్ క్రియేన్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత కేదార్ సెల‌గ‌మ్ శెట్టి నిర్మించ‌బోతున్నారు. కేదార్ కిది నిర్మాత‌గా తొలి చిత్రం. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కు అత్యంత స‌న్నిహితులు కావ‌డంతో తొలి చిత్రాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్లాన్ చేశారు.

ఈ ఏడాది అత్యంత క్రేజీ కాంబోగా సుక్కు – విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల కాంబినేష‌న్ నిల‌వ‌బోతోంది. యువ‌ నిర్మాత కేదార్ సెల‌గ‌మ్ శెట్టి పుట్టిన రోజు సంద‌ర్భంగా  ఈ చిత్రాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.  2022లో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్నారు. ఈ ప్రాజెక్ట్ విష‌యంలో విజ‌జ్ఞ్ దేవ‌ర‌కొండ సూప‌ర్ ఎక్సైటెడ్‌గా వున్నాడ‌ట‌. ఆడియ‌న్స్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటార‌ని, ఓ మెమొర‌బుల్ సినిమాని అందించ‌బోతున్నామ‌ని గ్యారెంటీ ఇస్తున్నాను. సుకుమార్ సార్‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి వేయిట్ చేయ‌లేక‌పోతున్నా. హ్యాపీ బ‌ర్త్‌డే కేదార్ నువ్వు  మంచి స్నేహితుడివే కాదు హార్డ్ వ‌ర్క‌ర్‌వి కూడా` అని ట్వీట్ చేశారు.

ఈ ప్రాజెక్ట్ గురించి కేదార్ మాట్లాడుతూ `ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెష‌ల్‌. నాకు ఎంతో ఇష్ట‌మైన వ్య‌క్తులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సుకుమార్ గార్ల‌తో నా మొద‌టి సినిమా అనౌన్స్ చేసినందుకు అనందంగా వుంది. ఈ సినిమా 2022లో మొద‌ల‌వుతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వుండ‌బోతోంది. కొత్త‌దనాన్ని ఇష్ట‌ప‌డే విజ‌య్‌, సుకుమార్ ల క‌ల‌యిక‌లో సినిమా అంటేఊ అంచ‌నాలుంటాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గని స్థాయిలో ఈ సినిమా వుంటుంది` అన్నారు.