మ‌ల్టీప్లెక్స్ రంగంలోకి విజ‌య్ దేవ‌ర‌కొండ!

Vijay deverakonda avd cinemas ready to launch
Vijay deverakonda avd cinemas ready to launch

`అర్జున్‌రెడ్డి` చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేష‌న్ సృష్టించారు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌న క్రేజ్‌నే రౌడీ అంటూ కాస్ట్యూమ్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌స్త్ర శ్రేణి ప్ర‌పంచంలో త‌న‌దైన మార్కుని క్రియేట్ చేసి సంచ‌ల‌నం సృష్టించారు. ఇటీవ‌ల కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ని స్థాపించి నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించారు. `మీకు మాత్ర‌మే చెప్లా` అంటూ తొలి చిత్రాన్ని నిర్మించారు.

తాజాగా ఇప్పుడు ఎగ్జిబిషన్ వ్యాపారంలోకి ప్రవేశించారు. విజయ్ తన మొదటి మల్టీప్లెక్స్ ‘ఎవిడి సినిమాస్’ ను తన స్వగ్రామమైన మహాబూబ్‌నగర్‌లో ప్రారంభించటానికి సిద్ద‌మ‌య్యారు. ఏషియ‌న్ గ్రూప్‌తో క‌లిసి విజ‌య్ దేర‌వ‌కొండ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్ర‌స్తుంత ‘ఎవిడి సినిమాస్’ పేరుతో ఇప్ప‌టికే నిర్మాణం ప్రారంభ‌మైంది. చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

ఎవిడి సినిమాస్ అంటే ఏసియ‌న్‌ విజయ్ దేవరకొండ సినిమాస్ అని అర్థం.  ఏషియన్ సినిమాస్ థియేట‌ర్స్ తో క‌లిసి మల్టీప్లెక్స్ బృందంతో క‌లిసి ఈ రంటంలోకి విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంట‌ర‌వుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టించిన `వకీల్ సాబ్` స్క్రీనింగ్‌తో ఈ  మల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 9 న విడుదల కానుంది.