ముంబైలో క‌ర‌ణ్ టీమ్‌తో రౌడీ చిల్ ఔట్‌!

Vijay deverakonda chill out at mumbai
Vijay deverakonda chill out at mumbai

టాలీవుడ్‌ సెన్సేష‌న్ విజయ్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం లైగ‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అన‌న‌య్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌ర‌ణ్‌జోహార్‌, అపూర్వ మెహ‌తాతో క‌లిసి చార్మి, పూరి జ‌గ‌న్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ద్వారా విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ప్ర‌స్తుంతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. ఈ మూవీ రిలీజ్‌కి ముందే బాలీవుడ్ టాప్ సెట‌బ్రిటీస్‌ని ప‌రిచ‌యం చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు విజ‌య్‌. తాజాగా `లైగ‌ర్‌` టీమ్ అంతా ప్ర‌త్యేకంగా ఇటీవ‌ల ఓ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో క‌రణ్‌‌ జోహార్, చార్మి, పూరి, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో పాటు బాలీవుడ్ హాట్ బేబ్స్ కియారా అద్వానీ, సారా అలీఖాన్ పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన పార్టీ ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్న ఈ మూవీని సెప్టెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైట్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించిన మేక‌ర్స్ రాకెట్ స్పీడుతో మూవీని పూర్తి చేయ‌బోతున్నార‌ట‌.