సూపర్ స్టార్ సినిమాలో రౌడీ.. నిజమేనా?


సూపర్ స్టార్ సినిమాలో రౌడీ.. నిజమేనా?
సూపర్ స్టార్ సినిమాలో రౌడీ.. నిజమేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసాడు. ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ తన కెరీర్ లో అత్యధికం. ఈ సక్సెస్ తో ఫుల్ ఖుషీ అయిపోయిన మహేష్ ప్రస్తుతం యూఎస్ లో తన ఫ్యామిలీతో హాలిడేను ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ సమయంలోనే తన నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు సూపర్ స్టార్. యూఎస్ హాలిడే ముగిసి హైదరాబాద్ రాగానే స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ విని షూటింగ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పటికే పలు రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడన్నది ఒక రూమర్ అయితే కాదు కాదు ఇందులో మహేష్ స్పై ఏజెంట్ అన్నది మరో రూమర్. ఈ రెండు పాత్రల్లో ఏదైనా కూడా మహేష్ కు సరిగ్గా సరిపోతుంది కాబట్టి ఫ్యాన్స్ మాత్రం ఖుషీగా ఉన్నారు. పైగా ఈ రెండు రోల్స్ కు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది కాబట్టి మిగతా భాషల్లో కూడా రీచ్ ను ఆశించవచ్చు.

ఇక దీంతో పాటు కొత్తగా మరో రూమర్ స్టార్ట్ అయింది. అదేంటంటే ఇందులో హీరో విజయ్ దేవరకొండ ఒక కీలక పాత్రలో నటించనున్నాడని. మహర్షి చిత్రంలో అల్లరి నరేష్ చేత కీలక పాత్ర చేయించిన వంశీ పైడిపల్లి, ఈ సినిమా కోసం విజయ్ ను సంప్రదించాడని, విజయ్ కూడా ఎస్ అన్నాడని, విజయ్ తన సినిమాలో నటిస్తుండడం పట్ల మహేష్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడని ఒక రూమర్ మొదలైంది.

ఇందులో నిజానిజాల గురించి క్లారిటీ లేదు కానీ రూమర్స్ అన్నీ పాజిటివ్ గా వస్తుండడంతో మహేష్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు ఒక వార్త అందింది. ఏదైమైనా ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే మాత్రం మరో నెల రోజులైనా ఎదురుచూడక తప్పదు.