ఫారిన్ బాక్స‌ర్ కోసం ఫైట‌ర్ వెయిటింగ్‌!


ఫారిన్ బాక్స‌ర్ కోసం ఫైట‌ర్ వెయిటింగ్‌!
ఫారిన్ బాక్స‌ర్ కోసం ఫైట‌ర్ వెయిటింగ్‌!

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌రకొండ – వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ల క‌ల‌యిక‌లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. `ఫైట‌ర్‌` పేరుతో ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్, చార్మి‌, క‌ర‌ణ్ జోహార్, అపూర్వ మోహ‌తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టిస్తోంది. లాక్‌డౌన్ బిఫోర్ ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు.

ముంబై వీధుల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే పాల్గొన‌గా బైక్‌పై ఛేజింగ్ స‌న్నివేశాల్నికూడా నైట్ ఎఫెక్ట్‌లో  పూర్తి చేశారు. ఇటీవ‌ల వ‌రుస‌గా పెద్ద చిత్రాల షూటింగ్‌లు పునః ప్రారంభ‌మ‌‌య్యాయి. కానీ ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం ఇంత వ‌ర‌కు తిరిగి ప్రారంభించ‌లేదు.  `ఫైట‌ర్‌` ప్రారంభం కావాలంటే ఓ చైనీస్ లేదా తైవాన్‌కు చెందిన బాక్స‌ర్ వుండాల‌ట‌.

ఆ బాక్స‌ర్ కోసం ద‌ర్శ‌కుడు పూరి ఎదురుచూస్తున్నార‌ట‌. అత‌న్ని ఇండియాకు ర‌ప్పించి కీల‌క ఘ‌ట్టాల‌ని షూట్ చేయాల‌న్న‌ది పూరి ప్లాన్. కానీ ప్ర‌స్తుతం వున్న ప‌రిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా క‌నిపించ‌డం లేద‌ని, అందు కోసం కొంత స‌మ‌యం వేచి చూడాల‌ని పూరి టీమ్ ఆలోచిస్తోంద‌ట‌. ఈ మూవీ ప్రొడ్యూస‌ర్‌ల‌లో ఒక‌రైన క‌ర‌ణ్ జోహార్ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో నెల‌కొన్న వివాదంలో చిక్కుకోవ‌డం కూడా `ఫైట‌ర్‌` షూటింగ్‌ని ప్ర‌భావితం చేస్తోంద‌ని చెబుతున్నారు.