విజయ్ దేవరకొండని ఫిక్స్ చేసిన పూరి

Vijay Deverakonda film with Puri Jagannadh and Charmee Kaur
Vijay Deverakonda film with Puri Jagannadh and Charmee Kaur

రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన పూరి జగన్నాద్ ఆ చిత్రం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న తరుణంలోనే మరో చిత్రాన్ని ప్రకటించడం హాట్ టాపిక్ అయింది.

డియర్ కామ్రేడ్ చిత్రం పరాజయం అవడంతో విజయ్ దేవరకొండ పనైపోయిందని’ వదంతులు వినిపిస్తున్న సమయంలో పూరి విజయ్ తో సినిమా ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

బక్రీద్ సందర్బంగా వీరి కలయికలో సినిమా వస్తుందని ఛార్మి కౌర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాద్ టూరింగ్ టాకీస్, పతాకాలపై పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

పూరి జగన్నాద్ తన తదుపరి చిత్రం డబుల్ ఇస్మార్ట్ ఉంటుందని పలు ఇంటర్వ్యూస్ లో తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.. అదే కనుక నిజమైతే తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకి పర్ఫెక్ట్ చిత్రమవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇదే చిత్రం కనుక వస్తే రికార్డు కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయం ..! మరి ఈ చిత్రం చేస్తారా లేక వేరే చిత్రం ఏదైనా చేస్తారా అనేది పూరీనే చెప్పాలి..