రష్మిక కోసం విజయ్ దేవరకొండ


Vijay devarakonda And Rashmika Mandanna
Vijay devarakonda And Rashmika Mandanna

రౌడీ వేర్ అనే పేరుతో విజయ్ దేవరకొండ సరికొత్త డిజైన్ లతో గార్మెంట్స్ బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఇన్నాళ్లు రౌడీ బాయ్స్ కి మాత్రమే ఇక్కడ బట్టలు ఉండేవి కానీ ఇప్పుడు రష్మిక మందన్న బ్రాండ్ తో రౌడీ గర్ల్స్ కు కూడా గార్మెంట్స్ అందించే పనిలో పడ్డాడట విజయ్ దేవరకొండ . త్వరలోనే అమ్మాయిలకు కావాల్సిన డిజైనర్ వేర్ లను అందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

ఇక అమ్మాయిల బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా ……. ఇంకెవరు ? రష్మిక మందన్న ! అవును రౌడీ బాయ్స్ కి విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ అయితే అబ్బాయిలకు మాత్రం రష్మిక మందన్న అంట . ఈ ఇద్దరూ కలిసి నటించిన గీత గోవిందం సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు డియర్ కామ్రేడ్ చిత్రం చేస్తున్నారు . ఇది ఈనెల 26 న విడుదల కానుంది .