విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రెండ్ రేప్‌కు గుర‌య్యాడా?

Vijay Deverakonda friend was raped
Vijay Deverakonda friend was raped

టాలీవుడ్‌లో స‌రికొత్త టేకింగ్‌, మేకింగ్‌తో సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `అర్జున్‌రెడ్డి`. ఈ చిత్రంలో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాహుల్ రామ‌కృష్ణ‌ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయిన విష‌యం తెలిసిందే. ప‌క్క నేచుర‌ల్‌గా వీరిద్ద‌రి మ‌ధ్ వ‌చ్చే స‌న్నివేశాలు కుద‌ర‌డంతో ఇప్ప‌టికీ అవి ఫ్రెష్ ఫీలింగ్‌నే క‌లిగిస్తుంటాయి. ఆ త‌రువాత చేసిన `గీత గోవిందం`లోనూ విజ‌య్‌కి ఫ్రెండ్‌గా న‌టించిన రాహుల్ రామ‌కృష్ణ త‌న‌కూ ఓ మీటూ క‌థ వుందంటూ చేసిన ట్వీట్ టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

బాలీవుడ్ టు టాలీవుడ్ వ‌ర‌కు మీటూ సృష్టించిన ప్ర‌కంప‌న‌లు అంతా ఇంతా కాదు. శ్రీ‌రెడ్డి కార‌ణంగా మీటూ వివాదంతో టాలీవుడ్ జాతీయ స్థాయిలో వార్త‌ల కెక్కింది. తాజాగా రాహుల్ రామ‌కృష్ణ ట్వీట్‌తో టాలీవుడ్ బిగ్గీస్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డార‌ట‌. `చిన్న‌త‌నంలో రేప్‌కు గుర‌య్యాను. దీని గురించి ఎలా చెప్పాలో త‌న‌కు తెలియ‌డం లేదు. గ‌తం ఎప్ప‌టికీ గుర్తుంటుంది. ఎంత మ‌రర్చిపోదామ‌న్నా భ‌యాన‌క అనుభ‌వాలు వున్నాయి. ఈ స‌మాజంలో మ‌హిళ‌ల‌కే కాదు పురుషుల‌కు కూడా ర‌క్ష‌ణ లేదు. ఇలాంటి విష‌యాలు గుర్తొచ్చిన‌ప్పుడు మ‌న పిల్ల‌ల‌కు ఏ స్థాయి ర‌క్ష‌ణ వుంద‌నేది త‌లుచుకుంటేనే భ‌య‌మేస్తోంది` అని రాహుల్ రామ‌కృష్ణ ట్వీట్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

సోష‌ల్ మీడియాలో ఈ ట్వీట్ వైర‌ల్ కావ‌డంతో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రెండ్ రేప్‌కు గుర‌య్యాడా? అని చ‌ర్చ మొద‌లైంది. రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`తో పాటు వేణు ఊడుగుల `విరాట‌ప‌ర్వం` చిత్రంలోనేనూ న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.