విజ‌య్ దేవ‌ర‌కొండ `హీరో` ఆగిపోయింది!


విజ‌య్ దేవ‌ర‌కొండ `హీరో` ఆగిపోయింది!
విజ‌య్ దేవ‌ర‌కొండ `హీరో` ఆగిపోయింది!

విజ‌య్ దేవ‌ర‌కొండ స్పీడు త‌గ్గించాడు. ఇటీవల విడుద‌లైన `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌కు గురిచేయ‌డంతో త‌న స్పీడుకు బ్రేకులేశాడు. ఇంత‌కు ముందు అంటే `డియ‌ర్ కామ్రేడ్` టైమ్‌లో మైత్రీ మూవీమేక‌ర్స్‌కి రెండు చిత్రాల కోసం అగ్రిమెంట్ చేసుకున్న విజ‌య్ అదే సంస్థ‌లో `హీరో` చిత్రాన్ని మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. త‌మిళ ద‌ర్శ‌కుడు ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌.

కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. దాదాపు దీని కోసం 5 కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌. అంత ఖ‌ర్చు చేసినా అవుట్‌పుట్ మాత్రం అనుకున్న స్థాయిలో లేక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన మైత్రీ వారు సినిమాని అర్థాంత‌రంగా ఆపేశార‌ట‌. జూలైలోనే ఆపేసినా ఆ త‌రువాత మ‌ళ్లీ చేద్దామ‌ని విజ‌య్ చెప్ప‌డంతో మ‌ళ్లీ షూటింగ్ మొద‌లుపెట్టాల‌ని ప్ర‌య‌త్నించార‌ట‌. త‌రువాత కూడా సినిమా అవుట్ పుట్ అదే స్థాయిలో వుండ‌టంతో దీన్ని ఇక్క‌డితో ఆపేయ‌డ‌మే బెట‌ర్ అని డిసైడ్ అయ్యార‌ట‌.

ఫైన‌ల్‌గా `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` ఫ్లాప్ కావ‌డం, నిర్మాత‌ల‌కు న‌ష్టాల్ని తెచ్చిపెట్ట‌డంతో ఎందుకొచ్చిన ప్ర‌యోగం అని భ‌య‌ప‌డిన మైత్రీ మూవీమేక‌ర్స్ `హీరో` ప్రాజెక్ట్‌ను మొత్తానికే ఆపేస్తున్న‌ట్టు తాజాగా ప్ర‌క‌టించ‌డం, విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా అందుకు స‌మ్మ‌తించ‌డం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సినిమా స్థానంలో మైత్రీ వారికి విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమా చేయ‌నున్నాడ‌ట‌.