పాన్ ఇండియా లెవెల్‌లో రౌడీకి మూడ‌వ స్థానం!


పాన్ ఇండియా లెవెల్‌లో రౌడీకి మూడ‌వ స్థానం!
పాన్ ఇండియా లెవెల్‌లో రౌడీకి మూడ‌వ స్థానం!

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్‌లో సినిమా చేయ‌క‌పోయినా అత‌ని క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది. `అర్జున్‌రెడ్డి` సినిమాతో దేశ వ్యాప్తంగా విజ‌య్ దేవ‌ర‌కొండ పాపుల‌ర్ అయ్యారు.
త‌న క్రేజ్‌నే బ్రాండ్‌గా మార్చుకున్న ఈ రౌడీ హీరో అన‌తి కాలంలోనే స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకున్నారు.
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ విజ‌య్‌ని అభిమానించే వారున్నారంటే అత‌ని క్రేజ్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవ‌చ్చు.

రీసెంట్‌గా సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్‌లో అత్య‌థిక ఫాలోవ‌ర్స్ ని ద‌క్కించుకున్న తొలి సౌత్ హీరోగా రికార్డుని ద‌క్కించుకుని వార్త‌ల్లో నిలిచారు. తాజాగా మ‌రో రికార్డుని త‌న ఖాతాలో వేసుకోవ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇండియాలోని టాప్ 50 డిజైర‌బుల్ మెన్‌ల జాబితాలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఏకంగా 3 వ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు. రెండ‌వ  స్థానంలో ర‌ణ్‌వీర్ సింగ్ ఉండ‌గా బాలీవుడ్ హీరోల‌ని కింద‌కి నెట్టి విజ‌య్ మూడ‌వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇంత‌కు ముందు హైద‌రాబాద్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ గా వ‌రుస‌గా 2018, 2019  సంవ‌త్స‌రాల్లో మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో నిర్వ‌హించిన స‌ర్వేలో తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ మూడ‌వ స్థానాన్ని సొంతం చేసుకోవ‌డం అత‌ని క్రేజ్‌కి నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.