పార్టీ మోడ్‌లో ఎంజాయ్ చేస్తున్న `లైగ‌ర్‌` టీమ్‌!

పార్టీ మోడ్‌లో ఎంజాయ్ చేస్తున్న `లైగ‌ర్‌` టీమ్‌!
పార్టీ మోడ్‌లో ఎంజాయ్ చేస్తున్న `లైగ‌ర్‌` టీమ్‌!

టాలీవుడ్ సెన్సేష‌న్ విజయ్ దేవరకొండ న‌టిస్తున్న చిత్రం `లైగ‌ర్‌`. దర్శకుడు పూరి జగన్నాధ్ కలయికలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న మొదటి చిత్రమిది.  ప్ర‌స్తుంత ఈ మూవీ షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పునఃప్రారంభమైంది. అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్‌జోహార్‌, అపూర్వ మెహ‌తాతో క‌లిసి చార్మీ, పూరి జ‌గ‌న్నాథ్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాక్సింగ్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీతో విజయ్ దేవరకొండ తొలిసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఒకేసారి తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఇటీవ‌లే ముంబైలో షూట్ పునఃప్రారంభ‌మైనా షూట్ గ్యాప్‌లో టీమ్ మొత్తం పార్టీ మోడ్‌లోకి వెళ్లిపోతోంది. టీమ్ అంతా క‌లిసి వీకెండ్ పార్టీల‌తో హోరెత్తిస్తున్నారు.

తాజాగా `లైగ‌ర్‌` టీమ్ పార్టీకి సంబంధించిన ఫొటోల‌ని చార్మి సోష‌ల్ మీడియాలో అభిమానుల తో పంచుకుంది. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డిజైనర్ మనీష్ మల్హోత్రా, నటి సారా అలీఖాన్‌లను చూడవచ్చు. హీరోయిన్ అన‌న్య పాండే ప్లేస్‌లో సారా అలీఖాన్ `లైగ‌ర్‌` టీమ్ పార్టీల్లో పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.  ‘లైగర్’ వ‌ర‌ల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 9 విడుదలకు సిద్ధంగా ఉంది.