వ‌ర‌ల్డ్ వైడ్‌గా `లైగ‌ర్‌` పంచ్‌కి డేట్ ఫిక్స్‌!

Vijay deverakonda Liger release date locked
Vijay deverakonda Liger release date locked

టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ `లైగ‌ర్‌`. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ అన‌న్య పాండే హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది. ఈ మూవీ ద్వారానే విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తాతో క‌లిసి చార్మి, పూరి జ‌గ‌న్నాథ్ నిర్మిస్తున్నారు.

చాలా రోజులుగా ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం రౌడీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపుల‌కు తెర‌ప‌డింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించేసింది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ‌, హిందీ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్న ఈ మూవీలో ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్స‌ర్స్ క‌నిపించ‌బోతున్నార‌ట‌.

ఈ సంద‌ర్భంగా విడుద‌ల తేదీ పోస్ట‌ర్‌ని షేర్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కండ `డేట్ సెట్ట‌యింది. మేము సెప్టెంబర్ 9, 2021న వ‌చ్చేస్తున్నాం` అని ట్వీట్ చేశారు. గ‌త కొంత కాలంగా లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ గురువారం నుంచి ముంబైలో ప్రారంభం కాబోతోంది. ఓ కీల‌క షెడ్యూల్‌ని ప్రారంభిస్తున్నామ‌ని ఛార్మీ ఇన్ స్టా వేదిక‌గా వెల్ల‌డించింది.