దేశ‌ వ్యాప్తంగా పిచ్చెక్కించ‌డం గ్యారంటీ!

దేశ‌ వ్యాప్తంగా పిచ్చెక్కించ‌డం గ్యారంటీ!
దేశ‌ వ్యాప్తంగా పిచ్చెక్కించ‌డం గ్యారంటీ!

విజ‌య్ దేవ‌ర‌కొండ, వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ల క‌ల‌యిక‌లో పాన్ ఇండియా  మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తాతో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. గ‌త ప‌ది నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్‌కి బ్రేకిచ్చారు.

తాజాగా ఈ మూవీకి చిత్ర బృందం ముందు నుంచి ప్ర‌చారంలో వున్న `లైగ‌ర్‌` అనే టైటిల్‌ని ప్ర‌క‌టిస్తూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని సోమ‌వారం విడుద‌ల చేసింది. `సాలా క్రాస్ బ్రీడ్` అని ట్యాక్ లైన్. ల‌య‌న్‌, టైగ‌ర్‌ల మిశ్ర‌మ‌మే ఇత‌ను అన్న‌ట్టుగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్‌చేశారు. క‌ర్లింగ్ హెయిర్‌తో బాక్సింగ్ గ్లౌజ్ ధ‌రించి విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపిస్తున్నాడు.

వెన‌కాల సింహం, పులి క‌లిసి వున్న ఫొటోని సింబాలిక్‌గా చూపించారు. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఫ‌స్ట్ లుక్‌ని షేర్‌ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని ప్ర‌క‌టించ‌డం ఆనందంగా వుంది. జాతీయ స్థాయిలో పిచ్చెక్కించ‌డం గ్యారెంటీ` అని కామెంట్ చేశారు.