హరికృష్ణ మృతి కి ప్రముఖుల సంతాపం


vijay deverakonda, mahesh babu and other celebs mourn the demise of harikrishna

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది . సినిమారంగంలోనే కాకుండా రాజకీయరంగంలో హరికృష్ణ ది అందవేసిన చేయి కావడంతో హరికృష్ణ మృతి కి పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వై ఎస్ జగన్మోహన్ రెడ్డి లతో పాటుగా సినీ నటులు అక్కినేని నాగార్జున , మోహన్ బాబు , మహేష్ బాబు , అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ , పూజా హెగ్డే , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , నాని , దేవిశ్రీ ప్రసాద్ , హంసానందిని , హరీష్ శంకర్ , మంచు లక్ష్మి , అల్లరి నరేష్ తదితరులు సంతాపాన్ని తెలియజేసారు .

తెలుగుదేశం పార్టీ లో కీలకంగా వ్యవహరించిన హరికృష్ణ రవాణా శాఖా మంత్రిగా కూడా ఆరునెలల పాటు పనిచేసారు . హిందూపురం శాసనసభ్యుడి గా వ్యవహరించారు అలాగే రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేసారు హరికృష్ణ .

English Title: vijay deverakonda, mahesh babu and other celebs mourn the demise of harikrishna