రౌడీ చేతుల్లో ఎవ‌రా బుడ‌త‌డు?


రౌడీ చేతుల్లో ఎవ‌రా బుడ‌త‌డు?
రౌడీ చేతుల్లో ఎవ‌రా బుడ‌త‌డు?

టాలీవుడ్ సెన్సేష‌నల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ లాక్‌డౌన్ నుంచి ఇంటి ప‌ట్టునే వుంటున్న విష‌యం తెలిసిందే. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ ఓ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని చేస్తున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఆగిపోయింది. దీంతో అప్ప‌టి నుంచి ఇంటిప‌ట్టునే వుంటున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

ఈ కీలక టైమ్‌ని ఫ్యామిలీతో గ‌డిపేస్తున్నారు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ క్యూట్ ఫొటోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. అది వైర‌ల్‌గా మారింది. త‌న చేతుల్లో చిట్టి పొట్టి బుడ‌త‌డిని ప‌ట్టుకుని విజ‌య్ క‌నిపిస్తున్నారు. విజ‌య్ చేతుల్లో వున్న ఆ బుడ‌త‌డు ఎవ‌రు? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. అయితే దీనికి భిన్నంగా విజ‌య్ పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది.

`మీ చుట్టూ ప్రేమ‌తో నింపండి. నేను ఇష్టపడే పనిని నేను చేస్తాను, నేను ఇష్టపడే క్రీడను ఆడుతున్నాను, నేను ఇష్టపడేదాన్ని తింటాను, త్రాగుతాను, నేను ప్రేమిస్తున్న వ్యక్తులు నా చుట్టూ వుండేలా చూసుకుంటాను. నేను ప్రేమించే వ్య‌క్త‌లతో విలువైన స‌మ‌యాన్ని గ‌డ‌పాల‌నుకుంటాను. ఇవ‌న్నీ చూసిన వారికి నా జీవితం మ‌రోలా అనిపించొచ్చు.  మీ ప్రేమ‌ని తెలుసుక‌ని దాని కోసం శ్ర‌మించండి` అని విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశారు.