దొరసాని పై ప్రశంసల వర్షం కురిపించిన విజయ్ దేవరకొండా !!vijay devarakonda prises to vijay deverakonda
vijay devarakonda

ఆనంద్ దేవరకొండశివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం దొరసాని. పరువు హత్యల నేపథ్యంలో ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం జులై 12న విడుదలై హిట్ టాక్ ని తెచ్చుకుంది. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో  మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

1987లో వరంగల్ జిల్లాలో జరిగిన యదార్ధ ప్రేమకథ ఇది. ఈ చిత్రాన్ని చూసిన విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్, శివాత్మిక నటన చాలా బాగుంది. కొత్త వారైనా ఫెంటాస్టిక్ గా నటించారు..  అని నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరుపై హర్షం వ్యక్తం చేసారు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ ప్రమోషన్ లో విజయ్ తిరిగి వచ్చాక దొరసాని టీమ్ అందరిని కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ పాల్గొనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు!!