మైత్రితో దోస్తీ… దిల్ రాజుతో వైరం – విజయ్ దేవరకొండ!!


Vijay Deverakonda and Dil Raju

డియర్ కామ్రేడ్ డిజాస్టర్ ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య వైరం పెరుగుతోంది. ఎప్పటినుండో విజయ్ తో సినిమా చెయ్యాలని వెయిట్ చేసున్న దిల్ రాజు కి మళ్లి చేదు అనుభవం ఎదురైంది. ఈ సారి కూడా విజయ్ దిల్ రాజుకి హ్యాండ్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ సాధించిన పూరి జగన్నాద్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చేయనున్నాడు విజయ్.

తెలంగాణ నేపథ్యంలో రూపొందన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అయితే పర్ఫెక్ట్ యాప్ట్ అవుతాడని టీమ్ భావిస్తోంది. విజయ్ కూడా ఇప్పటికే పూరీని రెండు సార్లు కలిసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, పూరి కనెక్ట్స్ పతాకాలపై నిర్మించనున్నారని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి!
విజయ్ దేవరకొండ, దిల్ రాజు, పూరి జగన్నాద్