అర్జున్ రెడ్డితో పోల్చుకున్నా పర్వాలేదు అంటున్నాడు రౌడీ

అర్జున్ రెడ్డితో పోల్చుకున్నా పర్వాలేదు అంటున్నాడు రౌడీ
అర్జున్ రెడ్డితో పోల్చుకున్నా పర్వాలేదు అంటున్నాడు రౌడీ

అర్జున్ రెడ్డి ప్రభావం జనాలపై విపరీతంగా పడింది. సినిమా హిట్ అవ్వడమే కాదు, హీరో ఎవరైనా కొంచెం గెడ్డం పెంచి లవ్ ఫెయిల్యూర్ అంటుంటే అర్జున్ రెడ్డితో పోలిక పెట్టేస్తున్నారు. హీరోయిన్ ను కొంచెం గట్టిగా అరిస్తే అదుగో అర్జున్ రెడ్డి కాపీ అంటున్నారు. అంతలా అర్జున్ రెడ్డి సినీ ప్రేక్షకులపై ముద్ర వేసింది. కల్ట్ క్లాసిక్ అనిపించుకున్న అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ కెరీర్ మీద కూడా ప్రభావం చూపిస్తోంది. డియర్ కామ్రేడ్ సినిమాలో అర్జున్ రెడ్డి ఛాయలున్నాయంటూ అప్పట్లో కొంతమంది విమర్శించారు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలోనైతే అర్జున్ రెడ్డి దిగిపోయిందంటూ కామెంట్స్ వేసిన సంగతి తెల్సిందే.

వరల్డ్ ఫేమస్ లవర్ లో విజయ్ దేవరకొండ నాలుగు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడు. అందులో ఒక లుక్ లో గుబురుగెడ్డంతో ఉన్నాడు. ఇది అర్జున్ రెడ్డి తరహాలోనే ఉందని కామెంట్స్ వినిపించాయి. అలాగే ట్రైలర్ లో చూపించిన యామినీ అని అరిచే బిట్ అయితే అర్జున్ రెడ్డిలో ప్రీతి అని అరిచే బిట్ ను తలపిస్తోందని ఓపెన్ గానే చాలా మంది విమర్శించారు. రెండిటినీ పక్కపక్కన పెట్టి ట్రోల్స్ చేసారు.

అయితే ఈ విషయాలపై విజయ్ దేవరకొండ స్పందించాడు. వరల్డ్ ఫేమస్ లవర్ లో ఒక పోర్షన్ కొంచెం అర్జున్ రెడ్డి ఛాయలుంటే ఉండొచ్చు కానీ కథతో ఎలాంటి సంబంధం ఉండదని, కొంతమంది దాన్ని పోల్చుకున్నా తనకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేదని అంటున్నాడు విజయ్. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డి అని అలాంటి సినిమాతో పోల్చుకున్నా పర్వాలేదని కామెంట్ చేసాడు. అయితే ఇందులో నాలుగు ప్రేమకథలు నాలుగు భిన్నమైన ఫీలింగ్స్ ను కలిగిస్తాయని అభిప్రాయపడ్డాడు.

ఇక ఫ్యూచర్ లో ప్రేమకథలు చేయను అన్న స్టేట్మెంట్ మీద కూడా క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడూ ఒకలాంటి మూసలో పడిపోకూడదనే ఈ స్టేట్మెంట్]ఇచ్చానని, అయితే కథలో ప్రేమ కథ ఒక పార్ట్ గా ఉంటే ఓకే కానీ ప్రేమకథనే బేస్ గా సినిమా చేయనని అంటున్నాడు. ఇప్పుడు పూరి జగన్నాథ్ తో చేసే సినిమా కూడా యాక్షన్ ప్రధానంగా ఉన్నా అందులో కూడా ప్రేమ కథ ఉంటుందని తెలిపాడు.