స్టార్ డైరెక్ట‌ర్‌కు రౌడీ స్టార్ షాకిచ్చారా?

స్టార్ డైరెక్ట‌ర్‌కు రౌడీ స్టార్ షాకిచ్చారా?
స్టార్ డైరెక్ట‌ర్‌కు రౌడీ స్టార్ షాకిచ్చారా?

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న `లైగ‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తాతో క‌లిసి పూరిజ‌గ‌న్నాథ్‌, చార్మి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అన‌న్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఈ చిత్రాన్ని ఫాల్క‌న్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతోంది. ఇదిలా వుంటే యువసుధ ఆర్ట్స్  బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ మిక్కిలినేని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని చేయ‌బోతున్నారు. ఇదే సంస్థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ భారీ చిత్రాన్ని చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. దీనికి వెంకీ కుడుములని ద‌ర్శ‌కుడిగా ఫిక్స్ చేశార‌ట‌. ఇదే విష‌య‌మై కొర‌టాల శివ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఇటీవ‌ల సంప్ర‌దించార‌ని తెలిసింది.

అయితే ఇప్ప‌ట్లో తాను మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేన‌ని, ప్ర‌స్తుతం తాను వ‌రుస చిత్రాల‌తో బిజీగా వున్నాన‌ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఇచ్చిన ఆఫ‌ర్‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది. వెంకీ కుడుముల సినిమాని విజ‌య్ ఎందుకు రిజెక్ట్ చేశాడ‌న్న‌ది మాత్రం ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేద‌ట‌.