విజయ్ దేవరకొండకు ఇద్దరు భామలు కావాలట


vijay deverakonda romance with two heroines

యువతలో విపరీతమిన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ . ఇటీవలే నోటా చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో ఆ సినిమా పరాజయంతో కాస్త ఇబ్బంది పడ్డాడు . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు కానీ ఆ అంచనాలు అన్ని తల్లకిందులు కావడంతో తేరుకోవడానికి కొంత సమయం పట్టింది . మొత్తానికి నోటా నుండి బయటకు వచ్చిన విజయ్ తాజాగా రొమాంటిక్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు . ఇక అతడికి ఇద్దరు భామలు కావాలట రోమాన్స్ చేయడానికి .

ఇప్పటివరకు ఒక్క హీరోయిన్ తోనే నెట్టుకొచ్చిన విజయ్ దేవరకొండ తాజాగా తన తదుపరి చిత్రం కోసం ఏకంగా ఇద్దరు భామలను తీసుకున్నాడు . ఒకరేమో రాశి ఖన్నా కాగ మరొకరు ఐశ్వర్య రాజేష్ . ఈ ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు 80 వ దశకంలో నెగెటివ్ రోల్స్ , సైడ్ క్యారెక్టర్ లు పోషించిన్ నటుడు రాజేష్ కాగ అతడి కూతురే ఈ ఐశ్వర్య రాజేష్ , నటి శ్రీలక్ష్మి కి మేనకోడలు . క్రాంతి మాధవ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత కే ఎస్ రామారావు నిర్మించ నున్నాడు ఈ చిత్రాన్ని . త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ మరో యాంగిల్ చూపిస్తాడేమో !

English Title: vijay deverakonda romance with two heroines