నేను 25 స్టిల్ వర్జిన్ అంటున్న విజయ్ దేవరకొండ


Vijay Deverakonda says I m 25, Still Virginనా వయసు 25 , నేను స్టిల్ వర్జిన్ అని అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ . యూత్ ని ఎలా ఆకట్టుకోవాలో ఈ హీరోకు బాగా తెలిసింది దాంతో వాళ్లకు కావాల్సిన మసాలా అందిస్తూ ఖుషి చేస్తున్నాడు ఈ హీరో . 25 ఏళ్ల వయసు ఒంటి మీదకు వచ్చినప్పటికీ ఏ అమ్మాయిని కూడా ముట్టుకోలేదని , ఆ …… పని అస్సలు చేయలేదని అందుకే నేను వర్జిన్ అని అంటున్న విజయ్ దేవరకొండ స్టిల్ ని తాజాగా విడుదల చేసారు ఆ చిత్ర బృందం . శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” గీత గోవిందం ” .

విజయ్ దేవరకొండ సరసన ఛలో ఫేమ్ రష్మిక మండన నటిస్తోంది . కాగా తాజాగా విడుదలైన పోస్టర్ కు బ్రహ్మాండమైన క్రేజ్ వచ్చింది . ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు గీతా ఆర్ట్స్ అధినేతలు . రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడింది . గీతా ఆర్ట్స్ నిర్మాణం , పరశురామ్ దర్శకత్వం , విజయ్ దేవరకొండ హీరోయిజం వెరసి గీత గోవిందం కు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి .

యూత్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయట దాంతో సినిమా విజయం పై చాలా నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు . ఇటీవలే మహానటి చిత్రంలో నటించి ఈ ఏడాది క్లాసిక్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ గీత గోవిందం తో యూత్ ఫుల్ హిట్ కొట్టేలాగే ఉన్నాడు .

English Title: Vijay Deverakonda says Im 25, Still Virgin