స్టార్స్‌ని వెన‌క్కి నెట్టి రౌడీ హీరో కొత్త రికార్డ్‌


స్టార్స్‌ని వెన‌క్కి నెట్టి రౌడీ హీరో కొత్త రికార్డ్‌
స్టార్స్‌ని వెన‌క్కి నెట్టి రౌడీ హీరో కొత్త రికార్డ్‌

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. `అర్జున్‌రెడ్డి` సినిమాతో ఒక్క‌సారిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సంచ‌ల‌నం సృష్టించిన విజ‌య్ ఈ సినిమా విజ‌యం త‌రువాత నుంచి టాలీవుడ్‌లో త‌న మేనియాని కొన‌సాగిస్తున్నాడు. స్టార్ హీరోల‌కు ధీటుగా త‌న మార్కెట్‌ని విస్త‌రించుకుంటూ హాట్ ఫేవ‌రేట్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీగా మారిపోయిన విజ‌య్ దేవ‌రకొండ `నోటా`తో త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ హంగామా చేసిన విష‌యం తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా త‌న మేన‌రిజ‌మ్స్‌, ది బాయ్ నెక్ట్ డోర్ యాటిట్యూడ్‌తో ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల్ని కొల్ల‌గొట్టిన ఈ హీరో ద‌క్షిణాదిలో పాపుల‌ర్ స్టార్‌గా గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

సెన్సేష‌న‌ల్ హిట్ హిల్మ్ `అర్జున్‌రెడ్డి` త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో యావ‌త్ దేశం మొత్తం ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు మారుమ్రోగిపోతోంది. బాలీవుడ్ అత‌ని క్రేజ్‌కి రెడ్ కార్పెట్ ప‌రిచేస్తూ పార్టీల‌కి, ఫంక్ష‌న్‌ల‌కి ఆహ్వ‌నిస్తూ అధిక ప్రాధాన్య‌త‌నిస్తోంది. దీంతో విజ‌య్ క్రేజ్ దేశ వ్యాప్తంగా స్కై హైకి చేరిన‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ క్రేజ్‌తో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ స్టార్ హీరోల‌ని వెన‌క్కి నెట్టి స‌రికొత్త రికార్డును సృష్టించిన‌ట్లు తెలుస్తోంది. ప్రతీ సంవ‌త్స‌రం లాగే ప్ర‌ఖ్యాత గూగుల్ సంస్థ మోస్ట్ సెర్చ్‌డ్ సెల‌బ్రిటీ ఇన్ ఇండియా పేరుతో స‌ర్వేని నిర్వ‌హించింద‌ట‌. ఈ ట్రెండ్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు మొద‌టి స్థానంలో నిల‌వ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టాలీవుడ్‌లోని క్రేజీ స్టార్ హీరోలైన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌, త‌మిళ స్టార్ హీరోలు ర‌జ‌నీకాంత్‌, అజిత్‌, విజ‌య్ ల‌ని వెన‌క్కి నెట్టి మ‌రీ విజ‌య్ గూగుల్ సెర్చ్‌ ట్రెండ్స్‌లో తొలి స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే అంటున్నారంతా. విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్‌రానున్న రోజుల్లో మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం వుంద‌ని తాజా గ‌ణాంకాలు చెబుతుండ‌టం విశేషం. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం క్రాంతి మాధ‌వ్ చేస్తున్న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. దీనితో పాటు పూరి జ‌గ‌న్నాథ్ రూపొందించ‌బోతున్న `ఫైట‌ర్` సినిమాతో విజ‌య్ బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు. దీనికి స‌హ నిర్మాత‌గా బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూస‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్‌జోహార్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.