నిర్మాతగా మూడో సినిమాను నిర్మించనున్న విజయ్ దేవరకొండ

నిర్మాతగా మూడో సినిమాను నిర్మించనున్న విజయ్ దేవరకొండ
నిర్మాతగా మూడో సినిమాను నిర్మించనున్న విజయ్ దేవరకొండ

హీరోగా అతి తక్కువ సమయంలోనే విజయ్ దేవరకొండ స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో విజయ్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే విజయ్ కు రీసెంట్ గా మంచి సినిమా అంటూ పడలేదు. ఈ నేపథ్యంలో చాలా కసిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రొడక్షన్ దశలో ఉంది. ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెల్సిందే.

విజయ్ దేవరకొండ మరోవైపు నిర్మాతగా కూడా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ను స్థాపించి మొదటి ప్రయత్నంగా మీకు మాత్రమే చెప్తా చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా ప్లాప్ అయినా కానీ పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

రెండో సినిమాగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను పెట్టి పుష్పక విమానం తీసాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పుడు మూడో చిత్రం కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అందరూ కొత్తవాళ్లతో పృథ్వీ సేనా రెడ్డిను దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ ఒక చిత్రాన్ని నిర్మించనున్నాడు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.