చిరు సినిమా రీమేక్ లో విజయ్ దేవరకొండ?

చిరు సినిమా రీమేక్ లో విజయ్ దేవరకొండ?
చిరు సినిమా రీమేక్ లో విజయ్ దేవరకొండ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 35 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే తర్వాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ జరగలేదు. తాజా సమాచారం ప్రకారం ఆచార్య షూటింగ్ ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మొదలుపెట్టే అవకాశముంది. వచ్చే సమ్మర్ కు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఆచార్య తర్వాత చిరంజీవి ప్రాజెక్ట్ ఇప్పటికే కన్ఫర్మ్ అయింది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫెర్ రీమేక్ ను చేయనున్నాడు చిరంజీవి. ఇందుకోసం సుజీత్ ను దర్శకుడిగా ఎంచుకున్నాడు కూడా. సుజీత్ ప్రస్తుతం లూసిఫెర్ స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నాడు. లూసిఫెర్ రీమేక్ లో ఒక స్పెషల్ రోల్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన దగ్గరనుండి ఆ రోల్ ను ఎవరు చేస్తారా అన్న సందేహం అందరిలోనూ కలిగింది.

మొదట రామ్ చరణ్ పేరు వినిపించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అన్నారు, సాయి ధరమ్ తేజ్ పేరు కూడా వినిపించింది. అయితే కొన్ని రోజులకే అవేవీ నిజాలు కావని తేలిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ స్పెషల్ రోల్ కు విజయ్ దేవరకొండను తీసుకుందాం అనుకుంటున్నారట. ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ అయితే అన్ని విధాలా బాగుంటుందని దర్శకుడు సుజీత్ భావిస్తున్నాడట. మరి చూడాలి విజయ్ ఈ స్క్రిప్ట్ కు ఓకే చెబుతాడేమో.