రౌడీ హీరో కోసం బాలీవుడ్ క్రేజీ లేడీ ఫిక్స్‌!


రౌడీ హీరో కోసం బాలీవుడ్ క్రేజీ లేడీ ఫిక్స్‌!
రౌడీ హీరో కోసం బాలీవుడ్ క్రేజీ లేడీ ఫిక్స్‌!

టాలీవుడ్ సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాకు సైన్ చేసిన విష‌యం తెలిసిందే. `ఇస్మార్ట్ శంక‌ర్‌` త‌రువాత పూరీ నుంచి రాబోతున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. `ఫైట‌ర్‌` పేరుని ఈ చిత్రానికి ఇప్ప‌టికే ఖ‌రారు చేశారు. `డియ‌ర్ కామ్రేడ్‌` చిత్రాన్ని నాలుగు భాష‌ల్లో రిలీజ్ చేయ‌డంతో విజ‌య్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పూరిజ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ప్రీప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో వున్న ఈ సినిమాని బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయ‌డం కోసం క‌ర‌ణ్‌జోహార్‌ని పూరీ, ఛార్మీ ఒప్పించార‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. విజ‌య్ క్రేజ్ బాలీవుడ్ కు పాక‌డంతో క‌ర‌ణ్‌జోహార్ ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రిలీజ్ చేయ‌డానికి అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. ఇంత‌టి క్రేజీ ప్రాజెక్ట్ కోసం క్రేజీ క‌థానాయిక కావాలి కాబ‌ట్టి బాలీవుడ్ భామ‌ని గ‌త కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. అయితే శ్రీ‌దేవి ముద్దుల త‌న‌య జాన్వీని ఈ సినిమాకు ఖ‌రారు చేసిన‌ట్లు తాజా స‌మాచారం.

క‌ర‌ణ్‌జోహార్ ఈ ప్రాజెక్ట్‌కు యాడ‌వ్వ‌డం వ‌ల్లే జాన్వీక‌పూర్ ఈ చిత్రంలో న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. గ‌తంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఫ్యాన్‌ని అయిపోయాన‌ని, సౌత్‌లో న‌టించాల్సి వ‌స్తే విజ‌య్‌తో క‌లిసి న‌టించాల‌ని వుంద‌ని ఆ మ‌ధ్య జాన్వీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. జాన్వీ `ఫైట‌ర్‌` చిత్రాన్ని అంగీక‌రించ‌డానికి ఇది కూడా ఓ కార‌ణం అయివుండొచ్చ‌ని వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే పూరి క్యాంప్ నుంచి బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ట‌.