అందుకనే దేవరకొండ సైలెంట్ గా ఉన్నాడా?

అందుకనే దేవరకొండ సైలెంట్ గా ఉన్నాడా?
అందుకనే దేవరకొండ సైలెంట్ గా ఉన్నాడా?

విజయ్ దేవరకొండ సినిమాల విషయంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాల విడుదల అప్పుడు దేవరకొండ చేసే హంగామా అలా ఇలా ఉండదు. స్టేజ్ ఎక్కాడంటే ఏదొక స్పెషల్ స్పీచ్ ఉంటుంది. దాని గురించి జనాలు కొన్ని రోజులు మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విషయంలో దేవరకొండ ఎందుకో బాగా అండర్ ప్లే చేస్తున్నట్లు కనిపిస్తోంది. కావాలనే ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. దీని వెనుక కారణమేమై ఉంటుందా అని అందరూ చర్చించుకోవడం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.

నిజానికి విజయ్ దేవరకొండ సినిమాలకు యూత్ లో క్రేజ్ బాగానే ఉంది. అతని ప్లాప్ సినిమాలకు కూడా ఓపెనింగ్స్ బాగుంటాయి. డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ అప్పుడు విజయ్ చాలా కాన్ఫిడెన్స్ చూపించాడు. ఈ సినిమా కచ్చితంగా ఆడుతుందని గొప్పగా చెప్పుకున్నాడు. ఇది ఒక అద్భుతమైన కథ అన్న రీతిలో చిత్రానికి హైప్ ఇచ్చాడు. తీరా రిలీజ్ తర్వాత ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిప్పి కొట్టారు.

విజయ్ దేవరకొండ సినిమాలు హిట్ అయితే ఎంత బజ్ సృష్టిస్తాయో ప్లాప్ అయినా కూడా అంతే బజ్ ను తీసుకొస్తాయి. డియర్ కామ్రేడ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ చిత్రాన్ని ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మన రౌడీ హీరో ఈసారి వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా దాన్ని బయటకు ప్రదర్శించడానికి ఇష్టపడట్లేదు. సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశా లాంటి చిన్న చిన్న హైప్ మాటలు తప్పితే చాలా మామూలుగానే కనిపిస్తున్నాడు. ప్రచారం విషయంలో కూడా మరీ దూకుడుగా వెళ్లట్లేదు. చాలా కామ్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి ఓపెనింగ్స్ కూడాఅదిరిపోతున్నాయి. సంక్రాంతి సినిమాల తర్వాత మళ్ళీ బజ్ తీసుకొచ్చిన సినిమా ఇదే అంటూ ట్రేడ్ పండితులు సైతం చెబుతున్నారు. మరి ఈ బజ్ అంతా టిక్కెట్ల రూపంలోకి మారి ఓపెనింగ్స్ అదిరిపోతాయా? టాక్ బాగా వచ్చి రౌడీ కెరీర్ లో మరో హిట్ జమవుతుందా?