తమ్ముడ్ని ఎగతాళి చేసిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda
Vijay Deverakonda

అన్నయ్యా ! నేను హీరో అవుతాను అని సీరియస్ గా ఆనంద్ దేవరకొండ అంటే విజయ్ దేవరకొండ ఏమన్నాడో తెలుసా ……… బిగ్గరగా నవ్వాడట ! అంటే నువ్వెంటి ? హీరో ఏంటి ? అని ఎగతాళి చేసినట్లే కదా ! అన్నయ్య బిగ్గరగా నవ్వడంతో ముందుగా అవమానం అనిపించినా మళ్ళీ సీరియస్ గా నేను హీరో అవుతాను అని గట్టిగా చెప్పాడట.

దాంతో విజయ్ దేవరకొండ తన నవ్వుని ఆపేసి హీరోగా పరిచయం అయితే ఎన్ని విమర్శలు వస్తాయో తెలుసా …… అంటూ విడమరిచి చెప్పాడట . నీ లుక్స్ ని , నీ డ్యాన్స్ ని , నీ యాక్టింగ్ ని అన్ని కోణాల్లో విమరించే వాళ్లే ఉంటారు అంటూ . అయినా అన్న ఎన్ని చెప్పినా అవన్నీ పక్కన పెట్టి దొరసాని అనే చిత్రంలో హీరోగా నటించాడు . ఇక ఈ సినిమా జూలై 12 న విడుదలకు సిద్ధమైంది . శివాత్మిక హీరోయిన్ గా నటించింది . విజయ్ దేవరకొండ చెప్పింది నిజమే కదా ! మొదట్లో విమర్శలు తప్పవు , అయితే వాటినే సోపానాలుగా చేసుకుంటే మెట్లు అవుతాయి . ఇప్పటికే ఆనంద్ దేవరకొండపై విమర్శలు వస్తున్నాయి దొరసాని టీజర్ చూసి . సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు నటుడి పరిస్థితి ఏంటి ? అన్నది .