డియర్ కామ్రేడ్ మళ్ళీ వాయిదా పడనుందా ?


క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మే 31 న రిలీజ్ చేయాలనుకున్నారు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డియర్ కామ్రేడ్ విడుదల వాయిదా పడనుందని తెలుస్తోంది . ఈ వార్త విజయ్ దేవరకొండ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేయడం ఖాయం . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తోంది .

గీత గోవిందం తో ఆకట్టుకున్న ఈ జంట మళ్ళీ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి . డియర్ కామ్రేడ్ చిత్రం వాయిదాపడటానికి కారణం సూర్య నటిస్తున్న ఎన్ జి కే చిత్రం కూడా మే 31 న విడుదల అవుతుండటమే కారణం . డియర్ కామ్రేడ్ చిత్రం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , మలయాళ , కన్నడ బాషలలో విడుదల కానుంది దాంతో సూర్య చిత్రానికి పోటీగా కాకుండా జులై 19 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .