ఇక్కడే లేదంటే విజయ్ కు అక్కడ కూడా కావాలట


Vijay Deverakondas next will be pan indian
Vijay Deverakondas next will be pan indian

ప్యాన్ ఇండియా రిలీజ్.. ఇదివరకు ఈ మాట ఒక బ్రహ్మ ప్రధార్థంలా ఉండేది. కానీ రాను రాను పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ప్యాన్ ఇండియా అంటే భయపడే రీజినల్ సినిమాలు ఇప్పుడు ప్యాన్ ఇండియాను టార్గెట్ చేస్తుండడం విశేషం. అయితే ఇందులో ఎన్ని సక్సెస్ అవుతున్నాయి అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వరకే చూసుకుంటే బాహుబలి 1 అండ్ 2, ప్యాన్ ఇండియా సినిమాలుగా రిలీజై సక్సెస్ సాధించాయి. బాహుబలి తర్వాత ఎన్ని సినిమాలు ప్యాన్ ఇండియా కోసం ట్రై చేసినా అవి అంతగా సక్సెస్ అవ్వలేదు. బాహుబలి తర్వాత తెలుగులో సాహో, సైరా అంటూ ప్యాన్ ఇండియా అని టార్గెట్ చేసారు కానీ అవి అంతగా సక్సెస్ అవ్వలేదు.

సాహో బాలీవుడ్ లో బాగా ఆడితే తెలుగు రాష్ట్రాలతో సహా మిగతా అన్ని చోట్లా దారుణమైన ప్లాప్ గా మిగిలింది. ఇక సైరా తెలుగులో బానే ఆడింది కానీ మిగతా అన్ని చోట్లా ప్లాప్ అయింది. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియా అంటే మరోసారి ఆలోచనలో పడ్డాయి. వీటికి రిస్క్ కూడా ఎక్కువ ఉండడంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ మాత్రం ప్యాన్ ఇండియా కలలే కంటున్నాడు.

డియర్ కామ్రేడ్ చిత్రాన్ని దక్షిణాది భాషలన్నిటిలో వేర్వేరుగా ఒకేరోజున విడుదలైతే చేసారు కానీ అది తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా దారుణమైన ప్లాప్ గా మిగిలింది. ఇక నోటా కూడా తెలుగు, తమిళం భాషల్లో విడుదల చేస్తే రెండు చోట్లా కూడా ప్లాప్ అయింది. ఈ రెండు ప్లాపులతో విజయ్ కెరీర్ తెలుగులోనే బాగా డ్యామేజ్ అయింది. ఇక్కడే మార్కెట్ కోల్పోయాడు. ఇప్పుడు కచ్చితంగా ఇక్కడ హిట్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.

ఇలాంటి సమయంలో ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ చేస్తున్న విజయ్ దేవరకొండ తర్వాత పూరి జగన్నాథ్ తో చేయబోతున్న ఫైటర్ చిత్రాన్ని ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. తెలుగులో మార్కెట్ ను తిరిగి చేజిక్కుంచుకోవడానికి తంటాలు పడుతున్న తరుణంలో ఇప్పుడు ప్యాన్ ఇండియా వేషాలు అవసరమా అని బహిరంగంగానే కామెంట్స్ వేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ ఈ మాటలు వింటున్నాడా?.