వరల్డ్ ఫేమస్ లవర్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


 

Vijay Deverakondas world famous lover 2 days collections report
Vijay Deverakondas world famous lover 2 days collections report

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి మొదటి షో నుండే మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చిన విషయం తెల్సిందే. కొంతమందికి ఈ సినిమా తెగ నచ్చేస్తే, మరి కొంత మంది అర్జున్ రెడ్డి ఛాయలున్నాయని కామెంట్ చేసారు. మొత్తానికి వరల్డ్ ఫేమస్ లవర్ ఫలితం బయటకు వచ్చేసింది. ఇక ఈ చిత్ర కలెక్షన్స్ మాత్రం డీసెంట్ గానే ఉన్నాయి. మొదటి రోజు వరల్డ్ ఫేమస్ లవర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.42 కోట్ల షేర్ ను వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇది మూడో అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రం. డియర్ కామ్రేడ్ హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన చిత్రంగా నిలవగా, రెండో స్థానంలో గీత గోవిందం ఉంది.

ఇక మొదటి రోజు చిత్ర పెర్ఫార్మన్స్ బాగున్నా రెండో రోజు కలెక్షన్స్ లో కొంత మేర డ్రాప్ కనిపించింది. మిక్స్డ్ టాక్ వచ్చిన చిత్రాలకు ఈ డ్రాప్ సర్వ సాధారణమైన విషయమే. ఆదివారం కూడా ఈ చిత్ర కలెక్షన్స్ స్టడీగా ఉంటే వరల్డ్ ఫేమస్ లవర్ ఫలితంపై ఒక అంచనాకు రావొచ్చు. రెండో రోజు ఈ చిత్రం 1.8 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

వరల్డ్ ఫేమస్ లవర్ 2 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:

నైజాం: 2.98 కోట్లు
సీడెడ్: 0.60 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.85 కోట్లు
గుంటూరు: 0.51 కోట్లు
తూర్పు గోదావరి : 0.42 కోట్లు
పశ్చిమ గోదావరి : 0.31 కోట్లు
కృష్ణ: 0.33 కోట్లు
నెల్లూరు: 0.23 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ మొత్తం :  6.23 కోట్లు

క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, క్యాథెరిన్, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఐశ్వర్య రాజేష్, విజయ్ దేవరకొండ మధ్య శీనయ్య, సువర్ణల ట్రాక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.