కబీర్ సింగ్ ని ఇంకా చూడని విజయ్ దేవరకొండ


vijay devarakonda
vijay devarakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కబీర్ సింగ్ చిత్రాన్ని ఇంకా చూడలేదట ! కబీర్ సింగ్ రిలీజ్ అయి అప్పుడే వారం కావస్తోంది కానీ హీరో మాత్రం సినిమాని చూడలేదు , చూస్తాను అని అంటున్నాడు తాపీగా . తెలుగునాట ప్రభంజనం సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి . కాగా అదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసారు . ఇక దర్శకుడు కూడా సందీప్ రెడ్డి వంగా నే

షాహిద్ కపూర్ హీరోగా నటించిన కబీర్ సింగ్ కేవలం 5 రోజుల్లోనే 104 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించింది . తాను నటించిన పాత్రలో మరొక హీరో ఎలా చేసాడో చూసుకోవాల్సిన ఆవరసం ఉంది అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా కూడా కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా సినిమా చూడలేదు , చూస్తానని అంటున్నాడు . వైరల్ ఫీవర్ వచ్చింది అందుకే చూడలేక పోయాను అనేది దేవరకొండ డైలాగ్ . మరి ఎప్పుడు చూస్తాడో ? ఎప్పుడు తన అభిప్రాయం చెబుతాడో ? చూడాలి