మెగా హీరోతో `మాస్ట‌ర్` డైరెక్ట‌ర్‌?


మెగా హీరోతో `మాస్ట‌ర్` డైరెక్ట‌ర్‌?
మెగా హీరోతో `మాస్ట‌ర్` డైరెక్ట‌ర్‌?

కార్తి హీరోగా న‌టించిన చిత్రం `ఖైదీ`. హీరోయిన్‌, సాంగ్స్ అంటూ ఏమీ లేకుండా ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించింది. ఇందులో హీరో కార్తి ని చూపించిన విధానం, అత‌ని క్యారెక్ట‌రైజేష‌న్ ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ మూవీకి యంగ్ టాలెంటెడ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. అంత వ‌ర‌కు  మూడు చిత్రాలు చేసినా వాటి వ‌ల్ల రాని పేరు అత‌నికి ఈ మూవీతో వ‌చ్చింది.

దీంతో అత‌నికి హీరో విజ‌య్ వెంట‌నే భారీ సినిమా చేసే అవ‌కాశం ఇచ్చాడు. లోకేష్ క‌న‌గ‌రాజ్‌, విజ‌య్‌ల కాయిక‌లో రూపొందిన `మాస్ట‌ర్‌` ఈ సంక్రాంతికి విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్‌తో ఓ భారీ మూవీని చేస్తున్న లోకేష్ క‌న‌గ‌రాజ్ తాజాగా మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్‌కు స్క్రిప్ట్ వినిపించారని తెలిసింది‌.  ఈ మూవీని త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌రలోనే తెలియ‌నున్నాయి.

ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్‌`తో పాటు `ఆచార్య‌`లోనూ న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్త‌యితే గానీ లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు డేట్స్ కేటాయించ‌డం కుద‌ర‌దు. లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా రివేంజ్ థ్రిల్ల‌ర్‌ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌లో వుంది. ఇది పూర్త‌యితే గానీ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఫ్రీ కాలేడు.