టాలీవుడ్ ఎంట్రీకి విజయ్ పారితోషికం వింటే మతి పోవాల్సిందే!!

టాలీవుడ్ ఎంట్రీకి విజయ్ పారితోషికం వింటే మతి పోవాల్సిందే!!
టాలీవుడ్ ఎంట్రీకి విజయ్ పారితోషికం వింటే మతి పోవాల్సిందే!!

తమిళ సూపర్ స్టార్ విజయ్ టాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న విషయం తెల్సిందే. మహర్షి తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి  విజయ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు.

ఇటీవలే రామ్ చరణ్ – శంకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించిన ఈయన ఇప్పుడు విజయ్ – వంశీ పైడిపల్లి మూవీని నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమా కోసం విజయ్ కు భారీ పారితోషికం ఇవ్వాల్సి వచ్చిందట. ఏకంగా 80 కోట్ల పారితోషికాన్ని విజయ్ ఈ ద్విభాషా చిత్రం చేయడం ద్వారా అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

స్క్రిప్ట్ విన్న తర్వాత 10 కోట్లను అడ్వాన్స్ గా అందుకున్నాడట విజయ్. ప్రస్తుతం చేస్తోన్న సినిమా తర్వాత విజయ్ ఈ ద్విభాషా చిత్రాన్ని టేకప్ చేయబోతున్నాడు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.