విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ గోపాల్ వర్మ

విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ గోపాల్ వర్మ
విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ గోపాల్ వర్మ

వివాదాలతో సహవాసం చేసే రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడూ పాజిటివ్ ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు విజయ్ దేవరకొండపై ప్రశంసల జల్లు కురిపించాడు. విజయ్ దేవరకొండ ఆనతి కాలంలోనే క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం లైగర్ ప్యాన్ ఇండియన్ సినిమాను చేస్తోన్న విషయం తెల్సిందే. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం లైగర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా లైగర్ లో నుండి కొన్ని సీన్స్ ను చూడటం జరిగిందిట. విజయ్ స్క్రీన్ ప్రెజన్స్ కు ముగ్దుడైపోయినట్లు తెలిపాడు వర్మ. గత 20 ఏళ్లలో ఇంత గొప్ప స్క్రీన్ ప్రెజన్స్ ఉన్న నటుడ్ని నేను చూడలేదు అని తెలిపాడు. అంతేనా, ఈ లైగర్ లయన్, టైగర్ కు క్రాస్ బ్రీడ్ కాదు అంతకన్నా గొప్పది. నిజానికి విజయ్ పవన్, మహేష్, రవితేజ, టైగర్ ష్రాఫ్ ల సూపర్ క్రాస్ అని ట్వీట్ చేసాడు వర్మ.

దీంతో లైగర్ మరోసారి వార్తల్లో నిలిచింది.