వాట్సాప్ గ్రూపుల్లో విజ‌య్ `మాస్ట‌ర్‌` క్లిప్స్‌!

వాట్సాప్ గ్రూపుల్లో విజ‌య్ `మాస్ట‌ర్‌` క్లిప్స్‌!
వాట్సాప్ గ్రూపుల్లో విజ‌య్ `మాస్ట‌ర్‌` క్లిప్స్‌!

ఇళ‌య‌ద‌ళ‌ప‌తి స్టార్ హీరో విజ‌య్ న‌టించిన భారీ త‌మిళ చిత్రం మాస్ట‌ర్‌`. `ఖైదీ` ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. గ్జేవియ‌ర్ బ్రిట్టో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ కోనేరు అందిస్తున్నారు. దాదాపు ఐదు భాష‌ల్లో ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా ఈ నెల 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది.

మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో విల‌న్‌గా విజ‌య్ సేతుప‌తి న‌టించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్‌కు ఒక్క‌రోజు ముందుగానే ఈ మూవీకి సంబంధించిన వీడియో క్ల‌ప్స్ వాట్సాప్ గ్రూపుల్లో.. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీనిపై త‌మిళ స్టార్స్ స్పందిస్తూ `మాస్ట‌ర్‌`కు అండ‌గా నిలుస్తున్నారు.

ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ప్రియమైన అందరికి
`మాస్టర్`‌ను మీ వద్దకు తీసుకురావడానికి ఏడాదిన్న‌ర సుధీర్ఘంగా శ్ర‌మించాం. మీరు థియేటర్లలో ఆనందిస్తారని మాకు న‌మ్మ‌కం ఉంది. ఈ చిత్రం నుండి బయటకి వ‌చ్చిన లీక్డ్ క్లిప్‌లను మీరు చూస్తే, దయచేసి దాన్ని షేర్ చేయ‌కండి. అందరినీ ప్రేమించండి. మరో రోజు ఆగితే `మాస్టర్` మీదే.` అని ట్వీట్ చేశారు. `మాస్ట‌ర్` క్లిప్స్‌ని సోనీ డిజిట‌ల్ కంప‌నీకి చెందిన ఓ వ్య‌క్తి లీక్ చేసిన‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. దీంతో `మాస్ట‌ర్‌` మేక‌ర్స్ స‌ద‌రు సంస్థ‌పై లీగ‌ల్‌గా చర్య‌లు తీసుకోబోతున్నారు.