విజయ్‌ సినిమా వ‌చ్చేది అప్పుడేనా?


విజయ్‌ సినిమా వ‌చ్చేది అప్పుడేనా?
విజయ్‌ సినిమా వ‌చ్చేది అప్పుడేనా?

క‌రోనా వైర‌స్ హాలీవుడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా వున్న ఫిల్మ్ ఇండ‌స్ట్రీస్‌ని కోలుకోలేని దెబ్బ‌తీస్తోంది. దీని కార‌ణంగా థియేట‌ర్స్‌తో పాటు షూటింగ్‌లు కూడా బంద్ కావ‌డంతో అంతా ఇబ్బందులు ప‌డుతున్నారు. క్రేజీ సినిమాల రిలీజ్‌ల‌ని, షూటింగ్‌ల‌ని వాయిదా వేసుకుంటున్నారు. తాజాగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సినిమా కూడా క‌రోనా కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కుంటోంది.

వరుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న విజ‌య్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం `మాస్ట‌ర్‌`. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌కుడు. గ్జేవియ‌ర్ బిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముందు ఏప్రిల్ 9న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా కార‌ణంగా ఆ రిలీజ్ డేట్‌ని వాయిదా వేయాల్సి వ‌చ్చింది. క‌రోనా కంట్రోల్‌లోకి వ‌స్తే జూన్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని భావించారు. కానీ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ చిత్ర రిలీజ్ అంత ఈజీ కాద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో థియేట‌ర్స్ రీ ఓపెన్ కావాలంటే మ‌రో మూడు నుంచి నాలుగు నెల‌లు ప‌ట్టే అవ‌కాశం వుంది. దీంతో `మాస్ట‌ర్‌` చిత్ర బృందం ఈ చిత్రాన్ని నాలుగు నెల‌ల త‌రువాతే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంటే దీపావ‌లికి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మాళ‌వికా మోహ‌న‌న్‌, ఆండ్రియా, శంత‌ను భాగ్య‌రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.