`మాస్ట‌ర్` టీజ‌ర్ రికార్డులు తిర‌గ‌రాస్తోంది!


`మాస్ట‌ర్` టీజ‌ర్ రికార్డులు తిర‌గ‌రాస్తోంది!
`మాస్ట‌ర్` టీజ‌ర్ రికార్డులు తిర‌గ‌రాస్తోంది!

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `మాస్ట‌ర్‌`. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌రో హీరో, విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో విజ‌య్‌కి జోడీగా మాళ‌విక మోహ‌న‌న్ న‌టిస్తోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్ర త‌మిళ టీజ‌ర్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. తాజాగా తెలుగు టీర్ విడుద‌లైంది. ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో విజ‌య్ రికార్డులు సృష్టించేలా క‌నిపిస్తున్నాడు.

టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్ వుంది. `అది నాకూ తెలుసు స‌ర్.. జేడీ ఒక నేర‌స్తుడు. ఒక పంతులుకు ఇంత ధైర్యం యాడ్నించి వ‌చ్చింది. అనే వాయిస్‌తో టీజ‌ర్ మొద‌లైంది. `ఖైదీ` చిత్రాన్నివినూత్నమైన టేకింగ్‌తో తెర‌కెక్కించి శ‌భాష్ అనిపించుకున్న లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రాన్ని కూడా అదే పంథాలో స‌రికొత్త మేకింగ్ టేకింగ్‌ల‌తో తెర‌కెక్కించ‌న‌ట్టుగా క‌నిపిస్తోంది. టీజ‌ర్ ఓపెనింగ్ షాట్‌.. కాలేజ్‌లో విజ‌య్‌పై షూట్ చేసిన సీన్స్‌.. ఆ త‌రువాత విజ‌య్‌… విజ‌య్ సేతుప‌తి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ దాస్‌, సిమ్ర‌న్‌, ఆండ్రియా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎక్స్ బి ఫిల్మ్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ మూవీ త‌మిళ వెర్ష‌న్ టీజ‌ర్ 45 మిలియ‌న్‌ల వ్యూస్‌ని దాటి యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోంది. తెలుగు టీజ‌ర్ కూడా అదే స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. త‌మిళ వెర్ష‌న్ టీజ‌ర్ `స‌ర్కార్‌` పేరిట వున్న రికార్డుని తిర‌గ‌రాసి స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది.