దీపావళి కానుకగా నవంబర్ 6 న విడుదలైన సర్కార్ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి . అయితే పలు వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముట్టడంతో మరిన్ని వసూళ్లు పెరిగాయి . తెలుగులో కూడా పెట్టిన పెట్టుబడి అందరికీ వచ్చేసింది . ఇక తమిళనాట అయితే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది సర్కార్ చిత్రం . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది . మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇంకా మంచి వసూళ్ల ని సాధిస్తోంది దాంతో అవలీలగా 250 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .
English Title: Vijay ‘s Sarkar beats charan’s Rangasthalam records