150 కోట్లు వసూల్ చేసిన విజయ్ సర్కార్


Vijay' s Sarkar joins 150 crore club

ఇళయ దళపతి విజయ్ నటించిన సర్కార్ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించి సంచలనం సృష్టిస్తోంది . నవంబర్ 6 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సర్కార్ చిత్రానికి మొదటి రోజున భారీ ఓపెనింగ్స్ లభించాయి . సినిమాకు డివైడ్ టాక్ బాగా స్ప్రెడ్ అయినప్పటికీ భారీ వసూళ్ళని సాధిస్తోంది విజయ్ కున్న క్రేజ్ తో . ఒకవైపు భారీ వసూళ్లు వస్తుండగా అదేస్థాయిలో వివాదాలు కూడా చేరుతున్నాయి . సర్కార్ చిత్రం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది . రకరకాల వివాదాలతో సర్కార్ చిత్రానికి మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేసారు జనాలు . దాంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . ఇంకేముంది ఇప్పుడు ఏకంగా 150 కోట్లు వచ్చాయి నాలుగు రోజుల్లో .

70 కోట్లకు పైగా షేర్ వచ్చింది దీంతో , అయితే ఈ సినిమాకు జరిగిన బిజినెస్ మొత్తం 185 కోట్లు . ఈ జోరు ఇలాగే కొనసాగితే 150 కోట్ల షేర్ రావడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు . తెలుగులో కూడా సర్కార్ సినిమాకు పోటీ ఏది లేకపోవడంతో మంచి వసూళ్లు వస్తున్నాయి . ఇక తమిళనాట విజయ్ స్టార్ హీరో కాబట్టి సర్కార్ అక్కడ సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించింది .

English Title: Vijay’ s Sarkar joins 150 crore club