విజ‌య్ సేతుప‌తి 10 కోట్లు డిమాండ్ చేశారా?


విజ‌య్ సేతుప‌తి 10 కోట్లు డిమాండ్ చేశారా?
విజ‌య్ సేతుప‌తి 10 కోట్లు డిమాండ్ చేశారా?

థ్రిల్ల‌ర్ చిత్రం `పిజ్జా`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి. ఆ త‌రువాత ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి న‌టించి `సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంతో మ‌రోసారి స్ట్రెయిట్ చిత్రం ద్వారా మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు. దీంతో విజ‌య్ సేతుప‌తికి తెలుగులో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో స్టోరీ డిమాండ్ మేర‌కు `ఉప్పెన‌` చిత్రం కోసం మ‌ళ్లీ విజ‌య్ సేతుప‌తిని ఎంపిక చేసుకున్నారు. ‌

సాయిధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీతో క‌లిసి ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి విజ‌య్ సేతుప‌తి పాత్ర ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచింది. ఆ క్రేజ్‌తో అల్లు అర్జున్ న‌టిస్తున్న `పుష్ప‌` చిత్రానికి విజ‌య్ సేతుప‌తిని కీ రోల్ కోసం ఎంపిక చేశార‌ని తెలిసింది. అయితే ఈ పాత్ర చేయ‌డానికి ఆయ‌న 10 కోట్లు డిమాండ్ చేసిన‌ట్టు తెలిసింది.

`ఉప్పెన‌` కోసం 5 కోట్లు తీసుకున్న ఆయ‌న `పుష్ప‌` కోసం 10 కోట్లు డిమాండ్ చేయ‌డంతో చిత్ర బృందం ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలిసింది. కాగా ఈ చిత్రంలో ప్ర‌ధాన విల‌న్‌గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని చిత్ర బృందం సంప్ర‌దిస్తోంద‌ని తెలిసింది. లాక్‌డౌన్ ఎత్తేసిన త‌రువాత దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం వున్న‌ట్టు చిత్ర వ‌ర్గాల్లో వినిపిస్తోంది.