మ‌క్క‌ల్ సెల్వ‌న్ కొత్త‌లుక్ వ‌చ్చేసింది!

Vijay sethupathi new look in uppena
Vijay sethupathi new look in uppena

త‌మిళంలో విభిన్న చిత్రాల హీరోగా విజ‌య్ సేతుప‌తికి మంచి పేరుంది. ఏ సినిమా చేసినా అందులో ఏదో కొత్త త‌ర‌హా పాత్ర అనిపిస్తే త‌ప్ప అంగీక‌రించ‌ని విజ‌య్ వ‌రుస‌గా తెలుగు సినిమాల్లో న‌టిస్తూ షాకిస్తున్నాడు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రంలో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన మక్క‌ల్ సెల్వ‌న్ తాజాగా మ‌రో చిత్రంలో న‌టిస్తున్నాడు. సాయిధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు పంజా వైష్ణ‌వ్ వేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `ఉప్పెన‌`.

సుకుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఓ జాల‌రి ప్రేమ‌క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నారు. సోమ‌వారం అత‌నికి స‌బంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ని చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది.

బ్లాక్ క‌ల‌ర్ అంబాసిడ‌ర్ కార్ ప‌క్క‌న నించుని మెలితిప్పిన మీసాల‌తో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో విజ‌య్ సేతుప‌తి క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. సినిమాలో విజ‌య్ సేతుప‌తి పాత్ర ప‌వర్‌ఫుల్‌గా వుంటుంద‌ని సంకేతాల్ని అందిస్తోంది.  కొత్త త‌ర‌హా క‌థ‌, క‌థ‌నాల‌తో నేటివిటీకి ద‌గ్గ‌ర‌గా అత్యంత స‌హ‌జ‌త్వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ చిత్రం ద్వారా కృతిశెట్టి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది.