మెగా ప్రిన్స్ కోసం త‌మిళ హీరో కావాల‌ట‌!


Vijay Sethupathi Play villain role to Varun Tej film
Vijay Sethupathi Play villain role to Varun Tej film

కోలీవుడ్‌లో హీరోగా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూనే తెలుగు, త‌మిళ భాష‌ల్లో విల‌న్‌గా న‌టిస్తున్నారు విజ‌య్ సేతుప‌తి. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `పిజ్జా` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన విజ‌య్ సేతుప‌తి.. మెగాస్టార్ చిరంజీవి న‌టించి `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యారు. ఈ సినిమాలో విజ‌య్ న‌ట‌న‌ని చూసి ముచ్చ‌ట‌ప‌డిన తెలుగు ద‌ర్శ‌కులు వ‌రుస ఆఫ‌ర్లిస్తామంటూ విజ‌య్‌ వెంట‌ప‌డుతున్నార‌ట‌.

తాజాగా సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా త‌రువాత సుకుమార్  ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ సినిమా అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఎర్ర చెంద‌నం స్ల‌గ్లింగ్ నేప‌థ్యంలో న‌ల్ల‌మ‌ల‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. ఇందులో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నారు. దీనితో పాటు ఆయ‌న‌కు మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలిసింది. .

మెగా హీరో మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ హీరోగా అల్లు వెంక‌టేష్ `బాక్స‌ర్‌` పేరుతో ఓ చిత్రాన్ని నిర్మంచ‌బోతున్నారు. ఇందులో వ‌రుణ్ బాక్స‌ర్‌గా విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. దీని కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ సినిమాలోని కీల‌క పాత్ర కోసం సునీల్‌శెట్టి కోసం చూస్తున్న మేక‌ర్స్ ఆ స్థానంలో విజ‌య్ సేతుప‌తిని ఫిక్స్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇందులో విల‌న్ పాత్ర కోస‌మే విజ‌య్ సేతుప‌తిని అడుగుతున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌.