రాయ‌నం లుక్ టెర్రిఫిక్‌గా వుందిగా!


రాయ‌నం లుక్ టెర్రిఫిక్‌గా వుందిగా!
రాయ‌నం లుక్ టెర్రిఫిక్‌గా వుందిగా!

కొన్ని పాత్ర‌లు కొన్ని సినిమాల‌కు ఆయువు ప‌ట్టుగా నిలుస్తాయి. ముఖ్యంగా ప్రేమ‌క‌థా చిత్రాల‌కు కీల‌క పాత్ర‌లే కీల‌కం. `సింధూర పువ్వులో` కెప్టెన్ పాత్ర‌లో న‌టించిన విజ‌య‌కాంత్‌,  `ఢీ`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, మ‌గ‌ధీర చిత్రాల్లోని శ్రీ‌హ‌రి పోషించిన పాత్ర‌లు ఆ సినిమాల‌కు మూల స్థంభాల్లా నిలిచి ఆయా చిత్రాలు సూప‌ర్‌హిట్‌, బ్లాక్ బ‌స్ట‌ర్‌లుగా నిల‌వ‌డంలో ప్ర‌ధాన భూమిక‌లు పోషించాయి.

అచ్చం అదే త‌ర‌హా పాత్ర‌లో త‌మిళ హీరో మ‌క్క‌ల్ సెల్వ‌న్‌గా పిలుచుకునే విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ఉప్పెన‌`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ తో క‌లిసి సుకుమార్ వ్రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఓ జాల‌రి ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో ఈ సినిమా సాగ‌నుంది. కీల‌క పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నారు. ఆయన పాత్ర పేరు `రాయ‌నం`. సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా విజ‌య్ పాత్ర నిలుస్తుంద‌ని సుకుమార్ విశ్వాసంతో వున్నాడు. ఈ రోజు రిలీజ్ చేసిన విజ‌య్ సేతుప‌తి లుక్ కూడా సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఈ నెల 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా రిలీజ్‌ని మే 15కు వాయిదా వేసిన‌ట్టు తెలిసింది.