విజ‌య్‌సేతుప‌తికి మ‌రో భారీ చిత్రం?


విజ‌య్‌సేతుప‌తికి మ‌రో భారీ చిత్రం?
విజ‌య్‌సేతుప‌తికి మ‌రో భారీ చిత్రం?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి ఓ భారీ చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇది ఎన్టీఆర్ న‌టించ‌నున్న 30వ చిత్రం. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు. ప్ర‌స్తుతంత ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా వున్నారు.

ఇది పూర్త‌యితే కానీ త్రివిక్ర‌మ్ చిత్రానికి డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేరు. ఇదిలా వుంటే త్రివిక్ర‌మ్ మూవీకి
సంబంధించిన తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. `ఆర్ ఆర్ ఆర్‌` పూర్తి కాగానే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డానికి త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నారని, ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేశార‌ని, ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ గా విజ‌య్‌సేతుప‌తిని అనుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

విజ‌య్ సేతుప‌తి న‌టించిన `మాస్ట‌ర్‌`, ఉప్పెన‌` చిత్రాలు తెలుగులో సూప‌ర్ డూప‌ర్ హిట్‌లు గా నిల‌వ‌డంతో ఎన్టీఆర్ చిత్రంలోనూ విల‌న్‌గా విజ‌య్‌సేతుప‌తి అయితే బాగుంటుంద‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నార‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. స్టోరీ డిమాండ్ మేర‌కు ఎన్టీఆర్‌ని ఢీకొట్టే పాత్ర‌లో విజ‌య్‌సేతుప‌తి అయితేనే ప‌వ‌ర్‌ఫుల్‌గా వుంటుందని వార్త‌లు వినిపిస్తున్నాయి.