విజ‌య్‌సేతుప‌తి బ‌ర్త్‌డే లుక్ టెర్రిఫిక్!

విజ‌య్‌సేతుప‌తి బ‌ర్త్‌డే లుక్ టెర్రిఫిక్!
విజ‌య్‌సేతుప‌తి బ‌ర్త్‌డే లుక్ టెర్రిఫిక్!

విభిన్న‌మైన చిత్రాల‌తో కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు విజ‌య్‌సేతుప‌తి. వెర్స‌టైల్ న‌ట‌న‌కు, పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ఆయ‌న ప్ర‌స్తుతం హీరోగా, విల‌న్‌గా యమ బిజీగా వున్నారు. ఆయ‌న పుట్టిన రోజు నేడు. `పిజ్జా` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన విజ‌య్‌సేతుప‌తి పుట్టిన‌రోజు నేడు. ఆయ‌న ప్ర‌స్తుతం `ఉప్పెన‌` చిత్రంతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌బోతున్నారు. ఈ   సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంబంధించిన బ‌ర్త్‌డే పోస్ట‌ర్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది.

వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. క‌న్న‌డ భామ కృతిశెట్టి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. స‌ముద్ర తీరం వెంట వునన్న ఓ గ్రామంలోని నిరుపేద యువ‌కుడికి, పెద్దింటి అమ్మాయికి మ‌ధ్య సాగే రొమాంటిక్ ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

ఇందులో గ్రామ పెద్ద రాయ‌నంగా గంభీర‌మైన పాత్ర‌లో విజ‌య్‌సేతుప‌తి న‌టిస్తున్నారు. తాజాగా విడుద‌ల చేసిన ఆయ‌న లుక్ టెర్రిఫిక్‌గా వుంది. చేతిలో బ్లాక్ గాగుల్స్, మ‌రో చేతిలో ఫోన్ రిసీవ‌ర్ ప‌ట్టుకుని విజ‌య్‌సేతుప‌తి క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. య‌దార్థ ప్రేమ‌క‌థ త‌ర‌హాలో రూపొందిన ఈ చిత్రాన్ని వ‌చ్చేనెల ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.