మ‌హేష్ హీరో అయితే తానే విలన్ అంటున్నాడు! 

Vijay to play villain role in mahesh movie
Vijay to play villain role in mahesh movie

మ‌హేష్ బాబు హీరోగా న‌టిస్తే తాను విల‌న్‌గా న‌టిస్తాన‌ని త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కండీష‌న్ పెట్టార‌ట‌. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ఇటీవ‌ల వెల్ల‌డించారు. తెలుగులో మ‌హేష్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాన్ని త‌మిళంలో విజ‌య్ రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ప్ర‌య‌త్నాలు చేశారు.

క‌ల్కీ కృష్ణ‌మూర్తి న‌వ‌ల `పొన్నియి‌న్ సెల్వ‌న్` ఆధారంగా అదే పేరుతో సినిమా చేయాల‌ని, మ‌హేష్‌, విజ‌య్‌ల‌ని కీల‌క పాత్ర‌ల కోసం మ‌ణిర‌త్నం అడ‌గ‌డంతో ఈ ఇద్ద‌రు హీరోలు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ఆ త‌రువాత ఏర్ప‌డిన ఫైనాన్సియ‌ల్ ఇబ్బందుల కార‌ణంగా ఆ ప్ర‌య‌త్నాలు ఆపేశారు. ఇదిలా వుంటే మ‌హేష్‌, విజ‌య్‌ల క‌ల‌యిక‌లో ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేశార‌ట‌. మ‌హేష్ హీరోగా విజ‌య్ విల‌న్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాల‌నుకున్నార‌ట‌.

ప్లాన్ న‌చ్చింద‌ని, వెంట‌నే క‌థ‌ని రెడీ చేయ‌మ‌ని మ‌హేష్‌, విజ‌య్ చెప్పార‌ట. అంతే కాకుండా మ‌హేష్ హీరోగా చేస్తేనే తాను విల‌న్‌గా న‌టిస్తాన‌ని మ‌రో హీరో అయితే మాత్రం తాను న‌టించ‌న‌ని హీరో విజ‌య్ కండీష‌న్ పెట్టార‌ట‌. మురుగ‌దాస్ త్వ‌ర‌లో విజ‌య్ హీరోగా `తుపాకి` చిత్రానికి సీక్వెల్‌ని రూపొందించే ప్ర‌య‌త్నాల్లో వున్నారు.