విజయ్ Vs విజయ్ పోస్టర్ అరాచకం


విజయ్ Vs విజయ్ పోస్టర్ అరాచకం
విజయ్ Vs విజయ్ పోస్టర్ అరాచకం

తమిళ అగ్రహీరో దళపతి విజయ్ మరియు మక్కల్ సెల్వన్ హీరో & విలన్ గా నటిస్తున్న సినిమా “మాస్టర్”. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ & సెకండ్ లుక్స్ విడుదల చేసారు. తాజాగా చిత్ర యూనిట్ మరొక పోస్టర్ రిలీజ్ చేసింది. గాయాలతో, రక్తంతో  హీరో, విలన్ ఇద్దరూ ఒకరినొకరు ఎదుర్కునే ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విజయ్ దివ్యంగుల, బధిరుల పిల్లల శిక్షకుడిగా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో హీరోతోపాటు, విలన్ పాత్ర వేస్తున్న విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కూడా ఫుల్ హై లో ఉన్నారు. మరికొంత మందో అభిమానులు లయన్  వర్సెస్ హైనా అంటూ కొత్త పోలికలు మొదలుపెట్టారు.

దళపతి విజయ్, విజయ్ సేతుపతి ఇద్దరూ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తారని కొందరూ, విజయ్ మాత్రమె అని కొందరూ.. ఇలా ఊహాగానాలతో సినిమాకు మాత్రం మంచి హైప్ తెస్తున్నారు. గత ఏడాది ఖైతీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ ఈ సినిమాలో అంతకుమించి స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తాడని మూవీ లవర్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి దళపతి వర్సెస్ సేతుపతి లో ఎవరు ఎంత గొప్పగా కనపడేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి రిలీజ్ ప్లాన్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.