లేడీ అమితాబ్ కిక్ ప‌వ‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లేదుగా!


లేడీ అమితాబ్ కిక్ ప‌వ‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లేదుగా!
లేడీ అమితాబ్ కిక్ ప‌వ‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లేదుగా!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క్రేజీ క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగిన తార విజ‌య‌శాంతి. క‌థానాయిక‌ల్లో హీరోల స్థాయి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆమె ఎన్నో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. హీరోల స్థాయిలో విల‌న్‌ లపై మెరుపు దాడి చేసి తాను ఏ విష‌యంలోనూ త‌క్కువ కాద‌ని నిరూపించుకున్నారు. హీరోయిన్ ప్ర‌ధాన చిత్రాల‌తో శ్రీ‌దేవి త‌రువాత లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజ‌య‌శాంతి 13 ఏళ్ల క్రితం సినిమాల్ని వ‌దిలేశారు.

క్రియాశీల రాజ‌కీయాల్లోకి వెళ్లిన ఆమె అప్ప‌టి నుంచి సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు. తాజాగా మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ప్రొఫెస‌ర్ భార‌తి పాత్ర‌లో ఆమె న‌ట‌న‌కు థియేట‌ర్లో విజిల్స్ ప‌డుతున్నాయి. సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో త‌న‌లో ఇంకా ప‌వ‌ర్ త‌గ్గ‌లేద‌ని, 13 ఏళ్ల‌యినా అదే గ్రేస్‌, అదే జోష్ త‌న‌లో వున్నాయ‌ని నిరూపించుకున్నారు.

13 ఏళ్ల క్రితం విల‌న్‌ల‌ని ఒంటి చేత్తో మ‌ట్టిక‌రిపించిన ఆమె భోగి సంద‌ర్భంగా ఎకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధికారిక ట్విట్ట‌ర్ పేజీ రిలీజ్ చేసిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 53 ఏళ్ల వ‌య‌సులోనూ రైట్ లెగ్‌ని లిప్ట్ చేసి కిక్ ఇచ్చిన తీరు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఈ వీడియో చూసిన త‌రువాత ద‌ర్శ‌కులు ఆమె కోసం కొత్త పాత్ర‌లు రాస్తారేమో చూడాలి.