రాముల‌మ్మ రెమ్యున‌రేష‌న్ అంతా?Vijayashanthi shocking  Remuneration for Sarileru Neekevvaru
Vijayashanthi shocking Remuneration for Sarileru Neekevvaru

మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `సరిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో దిల్‌రాజు, అనిల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. మ‌హేష్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టించిన ఈ సినిమా తొలి రోజు తొలి షో నుంచే వసూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.

6 డేస్‌కి ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 77.94 కోట్ల షేర్‌ని సాధించి సంక్రాంతి రేస్‌లో విజేత‌గా నిలిచింది. రానున్న వీకెండ్‌లో మ‌రింత‌గా వ‌సూళ్లు సాధించే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ సినిమాతో రాముల‌మ్మ విజ‌యశాంతి రీ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

13 ఏళ్ల విరామం త‌రువాత విజ‌య‌శాంతి రీఎంట్రి ఇస్తున్న సినిమా అన‌గానే ఈ సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో ఇందులో ఆమె ప్రొఫెస‌ర్ భార‌తిగా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించి మెప్పించారు. ఈ పాత్ర కోసం రాముల‌మ్మ  కోటిన్న‌ర తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మైతే స్టార్ హీరోయిన్‌ల‌కి మించి విజ‌య‌శాంతి ఈ సినిమాకు పారితోషికం అందుకున్న‌ట్టే.