13 ఏళ్ల తర్వాత మళ్ళీ నటిస్తున్న విజయశాంతి

లేడీ సూపర్ స్టార్ గా లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి స్టార్ హీరోలకు ధీటుగా ఇమేజ్ ని క్రేజ్ ని సొంతం చేసుకుంది . అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు దూరం అయ్యింది కట్ చేస్తే 13 సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది . ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎమోషనల్ అయిన విజయశాంతి ఓ ప్రకటన జారీ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది .

కృష్ణ నటించిన ఖిలాడీ చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నేను మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది . పార్లమెంట్ సభ్యురాలిగా సేవలందించిన విజయశాంతి రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది దాంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో .